వక్ఫ్​ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలి : ఎంపీ రఘునందన్ రావు

వక్ఫ్​ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలి : ఎంపీ రఘునందన్ రావు

సంగారెడ్డి టౌన్, వెలుగు: నూతన రెవెన్యూ చట్టం ఆధారంగా సీఎం రేవంత్​రెడ్డి హైదరాబాద్​పరిసర ప్రాంతాల్లోని వక్ఫ్​ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఎంపీ రఘునందన్​రావు అన్నారు. సోమవారం ఆయన సంగారెడ్డి పట్టణంలోని పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షురాలు గోదావరి,  మాజీ ఎంపీ బీబీ పాటిల్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. వక్ఫ్​చట్టంపై ముస్లింలలో అపోహలు సృష్టిస్తూ అల్లర్లు రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

హీరాబాద్ నియోజకవర్గంలో సుమారు 12, 892 ఎకరాల పైచిలుకు భూములు వక్ఫ్​ ఆస్తులుగా ప్రకటించారని, ముస్లింలు ఆందోళనలు చేసినా న్యాయం జరగలేదని గుర్తు చేశారు. కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 78 లో 197 ఎకరాల భూమిని వక్ఫ్​ఆస్తిగా గుర్తించారన్నారు. దీంతో సుమారు 200 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. సమావేశంలో పార్టీ నాయకులు రాజేశ్వరరావు దేశ్​పాండే, మాణిక్యరావు, చంద్రశేఖర్, నాగరాజ్  పాల్గొన్నారు.